2018లో తగ్గిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు... ఫలిస్తున్న పోలీసుల వ్యూహం!
- 2017లో 8,015 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
- గత సంవత్సరం 5,692కు తగ్గిన కేసులు
- పట్టుబడితే కాలేజీలు, ఆఫీసులకు లేఖలు పంపుతున్న పోలీసులు
2017లో 8,015 డ్రంకెన్ డ్రైవ్ కేసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదు కాగా, 2018లో ఆ సంఖ్య 5,692కు తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, కౌన్సెలింగ్, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తదితర ఎన్నో చర్యలు తీసుకున్నా కనిపించని ఫలితాలు, వారి ఘనకార్యాన్ని చెబుతూ, లేఖలు రాయడం ప్రారంభమైన తరువాత కనిపిస్తోందని అన్నారు.