Andhra Pradesh: పౌరుషం లేకుండా జగన్ ఇప్పుడు కేసీఆర్ తో కలుస్తున్నారు: టీడీపీ నేత గోరంట్ల

  • పవన్ ను విమర్శించడంపై ఆదేశాలేం లేవు
  • తలసాని స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి
  • జగన్ పౌరుషం లేకుండా కేసీఆర్ ను కలుస్తున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శించవద్దని చంద్రబాబు తమకు ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్న కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చయ్య మీడియాతో మాట్లాడారు.

గతంలో ఓదార్పుయాత్ర కోసం వరంగల్ కు వెళ్లిన జగన్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు తరిమితరిమి కొట్టారని గోరంట్ల గుర్తుచేశారు. అయినా పౌరుషం లేకుండా జగన్ ఇప్పుడు కేసీఆర్ తో కలుస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ఈసారి కూడా పరాభవం తప్పదని తేల్చిచెప్పారు.
Andhra Pradesh
Telangana
Jagan
YSRCP
Telugudesam
Gorantla Butchaiah Chowdary
Pawan Kalyan
Jana Sena
KCR

More Telugu News