me too: మీటూలో కొందరి ఆరోపణలు నమ్మశక్యంగా లేవు : ‘సాహసమే శ్వాసగా’ హీరోయిన్‌ మంజిమా మోహన్‌

  • ఉద్యమంపై పూర్తి అవగాహన లేదు
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురుకాలేదు
  • షూటింగ్‌కి వచ్చామా, వెళ్లామా అన్నది నా తీరు
మీటూ ఉద్యమంలో కొందరు చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవని ‘సాహసమే శ్వాసగా’ (తమిళం ‘అచ్చం ఎంబదు మడమయడా’రీమేక్) చిత్రం హీరోయిన్‌ మంజిమా మోహన్‌ అభిప్రాయ పడింది. ఉద్యమం గురించి తెలిసినా పూర్తి అవగాహన లేదని, క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని అంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో, మీటూ ఉద్యమం కారణంగా చిత్ర పరిశ్రమలో ఏదో మార్పు వచ్చిందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చింది. మీటూ ఉద్యమం సందర్భంగా కొందరిపై వెల్లువెత్తిన ఆరోపణల్లో కొన్ని నమ్మదగినవి, కొన్ని నమ్మశక్యం కానివి కూడా ఉన్నాయని మంజిమా వ్యాఖ్యానించింది. తనకైతే మీటూ ఆరోపణలపై నమ్మకం లేదని తెలిపింది.

షూటింగ్‌కి వచ్చానా, మేకప్‌ పూర్తయ్యిందా, చిత్రీకరణ అయ్యిందా, ఇంటికి వెళ్లామా అన్నట్లు తన దినచర్య ఉంటుందని, అందుకని తనకు ఎటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని చెప్పింది. ‘అచ్చం ఎంబదు మడమయడా’ చిత్రం ఘన విజయం సాధించినా ఈ అమ్మడు కెరీర్‌కు అది ప్లస్‌ కాలేదు. త్వరలో విడుదలకానున్న హిందీ క్వీన్‌ మలయాళం రీమేక్‌ ‘జామ్‌జామ్‌’తోనైనా తన కెరీర్‌ మలుపు తిరుగుతుందేమోనని మంజిమా ఎదురు చూస్తోంది.
me too
manjima mohan

More Telugu News