BSP: ఇంతకీ మాయావతి ఆడా? మగా?.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

  • బహిరంగ సభలో మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు
  • బీజేపీ నేతలు మతిస్థిమితం కోల్పోయారన్న బీఎస్పీ నేత
  • బీజేపీలో వణుకు మొదలైందన్న అఖిలేశ్ యాదవ్
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మాయావతి ఆడా కాదు, మగా కాదంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తనను ఘోరంగా అవమానించిన పార్టీతోనే ఇప్పుడామె చేతులు కలిపారని అన్నారు. 1995లో లక్నో గెస్ట్‌హౌస్‌లో తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి మరీ ఇప్పుడామె వారితో చేతులు కలిపారని ఆరోపించారు.

సాధనా సింగ్ వ్యాఖ్యలపై బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా స్పందించారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీ నేతలు మతి స్థిమితం కోల్పోయారని విమర్శించారు. వారిని తక్షణం ఆగ్రా, బరేలీలోని మానసిక వైద్య శాలలో చేర్చాలని సూచించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎస్పీ-బీఎస్పీ కూటమితో బీజేపీలో వణుకు మొదలైందన్నారు.
BSP
SP
Uttar Pradesh
Sadhana Singh
Mayawati
Satish Mishra

More Telugu News