Kolkata: అమరావతి చేరుకున్న చంద్రబాబు!

  • నిన్న కోల్ కతాలో విపక్షాల ర్యాలీ
  • అమరావతికి రావాలని నేతలకు ఆహ్వానం
  • ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చంద్రబాబు
కోల్‌ కతాలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన మెగా ర్యాలీని ముగించుకున్న అనంతరం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తిరిగి అమరావతి చేరుకున్నారు.  'యునైటెడ్ ఇండియా ర్యాలీ'కి హాజరైన నేతలందరినీ త్వరలో అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట సభకు హాజరు కావాలని చంద్రబాబు ఆహ్వానించారు. కాగా, శనివారం నాడు సభ ముగిసిన అనంతరం, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో అతిథులకు మమతా బెనర్జీ తేనీటి విందు ఇవ్వగా, చంద్రబాబు అన్నీ తానై పర్యవేక్షించడం గమనార్హం. అంతకుముందు నిర్వహించిన ర్యాలీలో, బహిరంగ సభలో ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Kolkata
Rally
Chandrababu
Mamata Benarjee
Amaravati

More Telugu News