Asha Rani: వాంతి చేసుకుందామని బస్సు కిటికీ నుంచి వంగింది.. తల తెగి పడింది!

  • పన్నా జిల్లాకు బయలుదేరిన ఆశారాణి
  • కడుపులో తిప్పడంతో బయటకు వంగింది
  • విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన తల
  • బస్సు వేగమే ఘటనకు కారణం
బస్సు ప్రయాణం కొంతమందికి పడదు. దీంతో సహజంగానే వాంతులు అవుతుంటాయి. అలా వాంతి చేసుకుందామని బస్సు కిటికీ నుంచి బయటకు వంగిన మహిళ తల తెగిపడింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్నా నుంచి పన్నా జిల్లాకు బస్సులో ఆశారాణి అనే మహిళ బయలుదేరింది.

మార్గమధ్యంలో ఆమెకు కడుపులో తిప్పినట్టుగా అనిపించడంతో వాంతి చేసుకునేందుకు కిటికీ నుంచి బయటకు వంగింది. దీంతో ఆశారాణి తల విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సు వేగంగా ప్రయాణిస్తుండటంతో ఆమె తల తెగి పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.  
Asha Rani
Sathna
Madhya Pradesh
Bus
Current Pole
Postmartam

More Telugu News