Telangana: సత్తుపల్లి, అశ్వారావుపేటలను కలిపేసి ఓ జిల్లాగా చేయండి!: పొంగులేటి డిమాండ్

  • నరసింహన్ ప్రసంగమంతా అర్ధసత్యాలే
  • కొత్త పెన్షన్లు ఎప్పటినుంచి ఇస్తారో చెప్పాలి
  • మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈరోజు చేసిన ప్రసంగంలో అన్నీ అర్ధసత్యాలే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మిషన్ భగీరథ కోసం తవ్విన గుంతలను ఇంతవరకూ పూడ్చలేదని ఎద్దేవా చేశారు. వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో రైతుల పరిస్థితి అస్సలు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన అధికార టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి ఓ జిల్లాగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగా పెంచిన పెన్షన్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలన్నారు. అమాయకుల నుంచి ముక్కుపిండీ డబ్బులు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరారు. మంచిరేవులలో ఉన్న వాటర్‌ బాడీని కాపాడాలని తాను కేసీఆర్‌ను కోరాననీ, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
Telangana
Congress
TRS
KCR
ponguleti
sudhakar reddy

More Telugu News