Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు!

  • అత్యవసర విచారణ అవసరంలేదన్న కోర్టు
  • కేసును ఏపీ పోలీసులు విచారిస్తారన్న న్యాయవాది
  • వ్యతిరేకించిన జగన్ లాయర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్ఐఏ జోక్యం లేకుండా తామే విచారణను పూర్తిచేస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. సెలవు దినాల్లో కుట్ర పూరితంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
High Court

More Telugu News