anasuya: విజయ్ దేవరకొండ సినిమాలో అనసూయ

  • హీరోగా విజయ్ దేవరకొండ బిజీ
  • సొంత బ్యానర్ పై సినిమా
  •  ఒక పాత్రలో తరుణ్ భాస్కర్    
వెండితెర వైపు నుంచి అనసూయకి వస్తోన్న అవకాశాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తనకి నచ్చిన పాత్రలను ఓకే చేస్తూ ఆమె ముందుకు వెళుతోంది. తాజాగా 'ఎఫ్ 2' సినిమాలో అలరించిన అనసూయ .. త్వరలో 'యాత్ర' సినిమాతోను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఆమె విజయ్ దేవరకొండ సినిమాలోను చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ ఒక వైపున హీరోగా బిజీ అవుతూనే .. మరో వైపున చిత్ర నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాడు. తన బ్యానర్ అయిన కింగ్ హిల్స్ పై ఆయన ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఒక పాత్ర కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ ను తీసుకున్నారు. మరో పాత్ర కోసం అనసూయను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో రెండు పాత్రలకిగాను ఆర్టిస్టుల ఎంపిక జరగవలసి వుంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది త్వరలో తెలియనుంది.
anasuya

More Telugu News