Bill Gates: బర్గర్ షాపు ఎదుట క్యూలో ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

  • బర్గర్ షాపు ముందు సాధారణ వ్యక్తిలా గేట్స్
  • వైరల్ అవుతున్న ఫొటో
  • నిరాడంబరతకు ఆయన కేరాఫ్ అంటూ ప్రశంసలు
బిల్‌గేట్స్.. సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో ఈ పేరు చిరపరిచితం. మైక్రోసాఫ్ట్ అధినేత అయిన గేట్స్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన ఏదైనా కావాలనుకుంటే చిటికెలో ఆయన ముందు ప్రత్యక్షమవుతుంది. శాసించే స్థాయిలో ఉన్న అటువంటి వ్యక్తి ఓ బర్గర్ షాపు ముందు క్యూలో నిల్చుంటే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! అయినా ఇది నిజం.

ఓ బర్గర్ దుకాణం వద్ద ఆయన ఓ సాధారణ వ్యక్తిలా క్యూలో నిల్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం దర్పం లేకుండా, ఓపిగ్గా తన వంతు కోసం ఎదురుచూస్తున్న ఆయన నిరాడంబరతకు నెటిజన్లు హేట్సాఫ్ చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి ఆయన పర్యాయపదమంటూ ప్రశంసిస్తున్నారు.
Bill Gates
Micro soft
burger shop
America

More Telugu News