KTR: ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ బాటలోనే జగన్: కేటీఆర్

  • కాంగ్రెస్, బీజేపీకి జగన్ దూరం 
  • ఏపీ అభివృద్ధికి వ్యతిరేకంగా మేం మాట్లాడలేదు
  • సెటిలర్లు టీఆర్ఎస్‌కు ఓటేయడమే నిదర్శనం
ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ కోసం తమతో కలిసి నడవాలని జగన్‌ను కేటీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ ఈ భేటీపై స్పందించారు.

వంటేరు ప్రతాపరెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ పార్టీలతో పాటే.. వైసీపీ అధినేత జగన్ కూడా కాంగ్రెస్, బీజేపీకి దూరంగా ఉండే యోచనలో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి వ్యతిరేకంగా తామెప్పుడూ మాట్లాడలేదని.. సెటిలర్లు టీఆర్ఎస్‌కు ఓటేయడమే అందుకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
KTR
Jagan
Chandrababu
KCR
Congress
BJP

More Telugu News