modi: ప్రధాని మోదీ, తెలంగాణ మోదీ, ‘కోడికత్తి’ మోదీ అడ్డుపతున్నారు: సీఎం చంద్రబాబు

  • ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీ అభివృద్ధి ఆగదు
  • ముగ్గురు మోదీలు ఒక్కటయ్యారు
  • రాష్ట్రంపై గద్దల్లా పడుతున్నారు
ప్రధాని మోదీ, తెలంగాణ మోదీ, కోడికత్తి మోదీ..ఈ ముగ్గురు కలిసి ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీ అభివృద్ధి ఆగదని, ముగ్గురు మోదీలు ఒక్కటయ్యారని, రాష్ట్రంపై గద్దల్లా పడుతున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీతో మోదీ బాగున్నంత వరకూ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బాగున్నారని, మోదీతో మనం విభేదించాక ఏపీని కేసీఆర్ విమర్శించడం మొదలెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి బీజేపీ మేలు చేస్తుందని భావించాం కానీ, నమ్మకద్రోహం చేసిందని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీకి ‘ప్రత్యేకహోదా’ ప్రకటించాలని కోరుతున్నానని డిమాండ్ చేశారు.
modi
kcr
jagan
cm
Chandrababu

More Telugu News