Andhra Pradesh: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

  • ఒత్తిడి కారణంగా పేలిపోయిన బ్లోపైప్
  • కాలిపోయిన ఐదు బైక్ లు
  • మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
ఏపీలోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నెస్-3లోని బ్లోపైప్ ఒత్తిడి కారణంగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సమీపంలో పార్క్ చేసిన ఐదు బైక్ లు పూర్తిగా కాలిపోయాయి.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ విషయమై ప్లాంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. బ్లోపైప్ పేలిపోవడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందనీ, ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల భారీగా నష్టం సంభవించిందని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Visakhapatnam District
steel plant
blow piep
Fire Accident

More Telugu News