Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ.. వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న వైవి రామిరెడ్డి!

  • ఈ నెల 26న జగన్ సమక్షంలో వైసీపీలోకి
  • ఆదాల అనుచరుడిగా ఉన్న రామిరెడ్డి
  • పదవిపై ఇంకా రాని స్పష్టత
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగలనుంది. జిల్లాలో సీనియర్ నేత, ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుడు వై.వి.రామిరెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్ లోని జగన్ నివాసంలో ఈ నెల 26న రామిరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమయింది. కాగా, రామిరెడ్డికి వైసీపీలో ఎలాంటి పదవి, బాధ్యత ఇస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

ఇటీవల నెల్లూరు జిల్లాకే చెందిన వైసీపీ సీనియర్ నేత కొమ్మి లక్ష్మయ్య నాయుడు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆనం, మేకపాటి కుటుంబాలు వైసీపీలో చేరిన నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో వీరికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు కొమ్మి లక్ష్మయ్య నాయుడిని వ్యూహాత్మకంగా రంగంలోకి దించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
ramireddy
adala
join

More Telugu News