TRS: టీడీపీ నేతలు ఎందుకు బెదిరిపోతున్నారు?: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

  • జగన్‌ను కేటీఆర్‌ కలిస్తే అంత ఉలుకెందుకు
  • భూకంపం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది
  • నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలి
జగన్‌ను కేటీఆర్‌ కలవగానే ఏదో భూకంపం వచ్చినట్లు టీడీపీ నేతలు ఎందుకంతా బెంబేలెత్తిపోతున్నారని ఆశ్చర్యం వేస్తోందని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆసన్నగిరి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం జరిగిపోయిందని అంతగా బెదిరిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతూ నోరు పారేసుకుంటున్నారని, మాటలు అదుపులో పెట్టుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
TRS
Telugudesam
TRS mla jeevanreddy

More Telugu News