nikhil: 'అర్జున్ సురవరం'గా నిఖిల్?

  • దర్శకుడిగా టి.ఎన్.సంతోష్ 
  • టైటిల్ విషయంలో సమస్య 
  • మార్చిలో విడుదల చేసే ఆలోచన
నిఖిల్ కథానాయకుడిగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో 'ముద్ర' సినిమా నిర్మితమైంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. మార్చిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అయితే టైటిల్ విషయంలో తలెత్తిన సమస్య కారణంగానే ప్రచార సంబంధమైన కార్యక్రమాల వేగం పెంచకపోవడానికి కారణమని తెలుస్తోంది.

'ముద్ర' అనే టైటిల్ ను వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకున్నారట. అందువలన ఇప్పుడు నిఖిల్ సినిమాకి 'ముద్ర'కి బదులుగా మరో టైటిల్ ను సెట్ చేసుకోవలసిన పరిస్థితి ఎదురైందని సమాచారం. ఈ సినిమాలో నిఖిల్ .. 'అర్జున్ సురవరం' అనే పాత్రలో కనిపిస్తాడు. అందువలన అదే పేరును టైటిల్ గా ఖరారు చేసుకునే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే టైటిల్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
nikhil
lavanya

More Telugu News