India: 50 ఒవర్లూ ఆడలేకపోయిన ఆసీస్... భారత లక్ష్యం 231 పరుగులు!

  • 48.4 ఓవర్లలో ఆలౌట్
  • ఒంటరి పోరాటం చేసిన హాండ్స్ కాంబ్
  • మరికాసేపట్లో భారత్ ఛేజింగ్
మెల్ బోర్న్ లో జరుగుతున్న ఆఖరి వన్డేలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్ల పాటు కూడా నిలవలేకపోయింది. ఒవైపు నుంచి చాహల్ ఆసీస్ లైనప్ ను దెబ్బతీస్తూ 6 వికెట్లు సాధించిన వేళ, మరోవైపు నుంచి భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ రెచ్చిపోగా, ఆసీస్ జట్టు 48.4 ఓవర్లలోనే 230 పరుగులకు ఆలౌటైంది.

ఆసీస్ బ్యాట్స్ మన్లలో కారీ 5, ఫించ్ 14, ఖావాజా 34, ఎస్ఈ మార్ష్ 39, హాండ్స్ కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్ వెల్ 26, రిచర్డ్ సన్ 16, జంపా 8 పరుగులు చేయగా, స్టాన్ లేక్ డక్కౌట్ అయ్యాడు. సిడిల్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరికాసేపట్లో 231 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.
India
Australia
Cricket

More Telugu News