cudupha: కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు కడప రాక

  • శక్తి కేంద్ర ప్రముఖ్‌ సమ్మేళన్‌లో పాల్గొననున్న మంత్రి
  • కందుల మైదానంలో భారీ సభ
  • అమిత్‌షా రావాల్సి ఉన్నా చివరిలో మార్పు
కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు కడపకు రానున్నారు. కడపలో జరగనున్న శక్తి కేంద్ర ప్రముఖ్‌ సమ్మేళన్‌లో పాల్గొననున్నారు. ఇందుకోసం మంత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2.50 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు సంబంధించి పార్టీ నిర్వహిస్తున్న ప్రముఖ్‌ సమ్మేళన్‌లో పాల్గొంటారు.

వాస్తవానికి ఈ సమావేశానికి బీజేపీ చీఫ్‌ హాజరవుతారని తొలుత ప్రచారం చేశారు. అమిత్‌ షా స్వైన్‌ఫ్లూ బారిన పడి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండడంతో ఆయన స్థానంలో రాజ్‌నాథ్‌ వస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. కడపలోని కందుల మైదానంలో జరిగే సమ్మేళన్‌లో పాల్గొన్న అనంతరం మంత్రి సాయంత్రం 5 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.
cudupha
BJP sammelan
rajnathsing

More Telugu News