CBI: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై బదిలీ వేటు

  • బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి బదిలీ
  • ఈ మేరకు వెలువడ్డ ఉత్తర్వులు
  • ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన అలోక్ వర్మ  
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై బదిలీ వేటు పడింది. సీబీఐ నుంచి తప్పించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయన్ని బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, సీబీఐ చీఫ్ పదవి నుంచి అలోక్ వర్మను తప్పించి ఫైర్ సర్వీసెస్ డీజీగా ఇటీవల బదిలీ చేశారు. మనస్తాపం చెందిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అలోక్ వర్మ రాజీనామా చేసిన నాలుగు రోజులకే, సీబీఐలో నెంబర్ 2గా కొనసాగిన అస్థానాను ఆ పదవి నుంచి తప్పించడం గమనార్హం. 
CBI
special Director
Rakesh Aasthana

More Telugu News