samantha: సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో నాకు తెలియదు: కేఏ పాల్

  • నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు
  • ఇప్పటికే పవన్ కల్యాణ్ ని రెండుసార్లు కలిశాను
  • తెలియని వాళ్ల గురించి ‘తెలియదు’ అని చెప్పడం కరెక్టు
ప్రముఖ నటి సమంత ఎవరో తనకు తెలియదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనపై పలు ప్రశ్నలు సంధించారు. ‘నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు’ అని ఇటీవల పాల్ చేసిన వ్యాఖ్యల గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా, 'అవును. నాకు తెలియదు' అన్నారు.

‘పోనీ సమంత, రకుల్ ప్రీత్ సింగ్.. తెలుసా?’ అని ప్రశ్నించగా, తనకు తెలియదని జవాబివ్వడం గమనార్హం. ‘పవన్ కల్యాణ్ ఎవరో తెలుసా?’ అనే ప్రశ్నకు .. ఇప్పటికే పవన్ ని రెండుసార్లు కలిశానని’ అన్నారు. ‘ఎన్టీఆర్ తెలుసా?’ అని అడగగా, తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటికే ఆయన హీరో అని, ఆయన తెలియకపోవడమేంటంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే, సమంత ఎవరో తనకు తెలియదన్న కేఏ పాల్, ఆ తర్వాత ఆమె నాగార్జున కోడలని చెప్పారు. ఎందుకంటే, తాను రాజకీయాల్లో ఉన్నాను కనుక, అందరి ఓట్లు తనకు కావాలని, అందుకే, తెలియని ప్రముఖుల గురించి తెలుసుకుంటున్నానంటూ చెప్పుకురావడం గమనార్హం. తెలియని వాళ్ల గురించి ‘తెలియదు’ అని చెప్పడమే కరెక్టు అని, అబద్ధం చెప్పడం తనకు చేతగాదని అన్నారు.
samantha
rakul
NTR
Balakrishna
Pawan Kalyan

More Telugu News