tammareddy: 'వినయ విధేయ రామ' సెకండాఫ్ కేవలం ఫైట్స్ కోసమే తీసినట్టుగా అనిపించింది!: తమ్మారెడ్డి భరద్వాజ

షార్ట్స్‌లో చూడండి
సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ 'కథానాయకుడు' .. చరణ్ 'వినయ విధేయ రామ' ..  వెంకటేశ్ 'ఎఫ్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలను గురించి విశ్లేషిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ ఒక వీడియోను విడుదల చేశారు. 'కథానాయకుడు' సెకండాఫ్ విషయంలో సరైన శ్రద్ధ పెట్టకపోవడం వలన, అభిమానులు అసంతృప్తికి లోనయ్యారని అన్నారు.

ఫ్యామిలీ డ్రామాకి కామెడీ కూడా తోడు కావడం వలన,'ఎఫ్ 2' సినిమా బాగా ఆడుతోందని చెప్పారు. ఇక 'వినయ విధేయ రామ' విషయానికొస్తే, నటుడిగా 'రంగస్థలం' సినిమాకి ముందు చరణ్ వేరు .. తరువాత చరణ్ వేరు. ఆయన బోయపాటితో చేస్తున్నాడనగానే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బోయపాటి తన మార్క్ లోనే ఈ సినిమా తీశాడు. అయితే సెకండాఫ్ కేవలం ఫైట్స్ కోసమే తీసినట్టుగా అనిపించడం అభిమానుల అసహనానికి కారణమైంది. సక్సెస్ .. ఫెయిల్యూర్ అనేవి ఎప్పుడూ ఒకచోట వుండవు. ఎవరి ప్రయత్నం వాళ్లు చేశారంతే" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
tammareddy

More Telugu News