kcr: 'కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను...': ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం!

  • ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్
  • అంతకు ముందు అమరవీరులకు నివాళి అర్పించిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కేసీఆర్ తో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. కేసీఆర్ తర్వాత మహిళా ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. రెండు గంటల పాటు ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగనుంది.

అంతకు ముందు ప్రగతి భవన్ నుంచి గన్ పార్కుకు కేసీఆర్ వెళ్లారు. గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ, హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.
kcr
mla
oath
telangana
assembly

More Telugu News