Brahmanandam: హైదరాబాదులో అయితే తాకిడి ఎక్కువని.. ముంబైలో ఆపరేషన్ చేయించుకున్న బ్రహ్మానందం!

  • సంక్రాంతి నాడు బైపాస్ సర్జరీ
  • నిలకడగా ఉన్న ఆరోగ్యం
  • వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే
తెలుగు వెండితెర నవ్వుల రాజు బ్రహ్మానందంకు సంక్రాంతి నాడు బైపాస్ సర్జరీ జరుగగా, నేడు ఆయన్ను ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చనున్నారు. శస్త్రచికిత్స అనంతరం కనీసం వారం రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంచి, ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని చెప్పిన వైద్యులు, నేడు పరీక్షల అనంతరం ఆయన్ను సాధారణ గదికి మార్చనున్నారు.

ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుంటే అభిమానులతో ఇబ్బందులుంటాయన్న కారణంగానే ముంబైకి ఆయన్ను తీసుకెళ్లామని, ఆపరేషన్ విజయవంతం అయిందని వెల్లడించాయి. కాగా, దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం త్వరగా కోలుకుని, తిరిగి నవ్వులు పండించాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Brahmanandam
Operation
ICU
General Ward

More Telugu News