Karnataka: సంక్రాంతి రోజున అగ్ని గుండంలో నడిచిన గోవులు!

  • దండలు, గంటలతో గోవులకు అలంకరణ
  • మంటల్లోంచి పరుగులు తీసిన ఆవులు
  • వైరల్ అవుతున్న వీడియో
మకర సంక్రాంతి రోజున అగ్ని గుండంలో గోవులు నడిచిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. సిరిసంపదలు ఇంటికి వచ్చే శుభసందర్భాన నిర్వహించుకునే ఈ పండుగ సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. గోవుల మెడలో దండలు వేసి, గంటలు కట్టి అందంగా అలంకరించిన తర్వాత వాటితో కలిసి యజమానులు మంటల్లో నడిచారు. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండగా వాటి మధ్యలోంచి గోవులు పరుగులు తీశాయి. వాటి యజమానులు కూడా వాటితోపాటు మంటల్లో నడిచారు. పదుల సంఖ్యలో గోవులు ఈ మంటల్లోంచి పరుగులు తీయగా వేడుకను చూసేందుకు జనాలు పోటెత్తారు. సంక్రాంతి రోజున గోమాతను మంటల్లో నడిపించడం ఓ ఆచారమని నిర్వాహకులు తెలిపారు.
Karnataka
Bangaluru
cows
Burning Hay
Makar Sankranti

More Telugu News