Sankranthi festival: కోడి పందాలపై పోలీసుల దాడులు.. భారీగా కోళ్లు, సొమ్ము స్వాధీనం

  • కోడి పందాల నిర్వాహకుల నుంచి రూ.2.96 లక్షలు స్వాధీనం
  • 225 కోళ్లు, 300 కోడికత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • పదిమంది పేకాటరాయుళ్లపై కేసు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న కోడి పందాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అలాగే, పేకాట, కోతముక్క ఆడుతున్న 115 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న పదిమందిపై కేసులు నమోదు చేశారు. రూ. 12.36 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  ఇక, నగర వ్యాప్తంగా కోడి పందాలపై నిర్వహించిన దాడుల్లో మొత్తం రూ. 2.96 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, 225 కోళ్లు, 300 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Sankranthi festival
Vijayawada
cock fight
Police

More Telugu News