jagan: రేపు రాత్రి బయలుదేరి లండన్ వెళ్తున్న జగన్

  • ఐదు రోజుల పాటు లండన్ లో ఉండనున్న జగన్
  • కుటుంబసమేతంగా లండన్ పయనం
  • లండన్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తె
వైసీపీ అధినేత జగన్ రేపు రాత్రి బయలుదేరి లండన్ కి వెళ్తున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. తిరిగి 22వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. జగన్ కుమార్తె వర్ష లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆమె విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో, కుమార్తెను చూసేందుకు కుటుంబసమేతంగా జగన్ లండన్ వెళ్తున్నారు. మరోవైపు, దాదాపు ఏడాది కాలం అలుపెరగకుండా జగన్ పాదయాత్రను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం హైదరాబాదులోని నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
jagan
london
ysrcp

More Telugu News