Allu Arjun: మరో మారు పెద్ద మనసు చాటుకున్న బన్నీ

  • సంక్రాంతికి పాలకొల్లు వెళ్లిన బన్నీ
  • కల్యాణ మంటపం నిర్మాణానికి 10 లక్షలు
  • వచ్చేనెలలో త్రివిక్రమ్ తో సినిమా
బన్నీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా .. ఎంతో కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నాడు. కథాకథనాల్లో కొత్తదనం .. పాత్రల్లో వైవిధ్యం ఉంటేనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన సిద్ధపడుతుంటాడు. కొత్త హీరోలను వేదికలపై ప్రశంసించే ప్రత్యేకత బన్నీ సొంతం. ఇక ఏ ప్రాంతంలో ప్రకృతి కన్నెర్ర జేసినా అక్కడి ప్రజలకు సహాయ సహకారాలను అందించడంలోను .. నలుగురికి ఉపయోగపడే పనులకు విరాళాలను అందించడంలోను ఆయన ముందుంటాడు. అలా తాజాగా ఆయన పాలకొల్లులోని కల్యాణ మంటపం నిర్మాణానికి గాను తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. సంక్రాంతికి తన తాతయ్య అల్లు రామలింగయ్య గారి ఊరైన పాలకొల్లు వెళ్లిన ఆయనకి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఆయన అక్కడే పండుగ జరుపుకుంటున్నాడు. వచ్చేనెలలో త్రివిక్రమ్ తో ఆయన సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
Allu Arjun

More Telugu News