sai dharam tej: మెగా హీరో సినిమా రిలీజ్ డేట్ ఖరారు

  • విభిన్నమైన కాన్సెప్ట్ తో కిషోర్ తిరుమల
  • అయిదు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ
  • ఏప్రిల్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు  
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ .. రితిక సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

కథానాయికలలో ఒకరి పేరు 'చిత్ర' .. మరొకరి పేరు 'లహరి' అయ్యుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ టైటిల్లోని అయిదు అక్షరాలలో, ఒక్కో అక్షరంతో మొదలయ్యే ఒక్కో పేరుతో అయిదు ముఖ్యమైన పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి. 
sai dharam tej
kalyani
rithika

More Telugu News