Brahmanandam: బ్రహ్మానందానికి బైపాస్ సర్జరీ... వారం రోజులు ఆసుపత్రిలోనే!

  • గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన బ్రహ్మానందం
  • వారం తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం
  • వెల్లడించిన హృద్రోగ నిపుణులు రమాకాంత పాండ
టాలీవుడ్ లోనే టాప్ కమేడియన్ గా, హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే కన్నెగంటి బ్రహ్మానందంకు గుండెపోటు వచ్చిందని, ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని ఈ ఉదయం తెలియడంతో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. గుండెలో నొప్పితో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఆసుపత్రికి తరలించగా బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో, ముంబైలోని ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు రమాకాంత పాండ, సోమవారం (జనవరి 14) ఆపరేషన్ చేశారు. ఆపై ఆయన మాట్లాడుతూ, మరో వారం రోజుల పాటు బ్రహ్మానందాన్ని ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్ లో ఉంచనున్నామని, ఆపై మరోసారి అన్ని రకాల పరీక్షలూ చేసి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 23 లేదా 24న ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంటికి పంపుతామని అన్నారు.
Brahmanandam
Heart Attack
Mumbai
Surgery

More Telugu News