ravi shankar prasad: సైనస్ సమస్యతో ఎయిమ్స్ లో చేరిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

  • సైనస్ సమస్య తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స 
  • ఆరోగ్యం స్థిరంగా ఉందన్న ఎయిమ్స్ వైద్యులు
  • త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నడాక్టర్లు
కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గతకొంత కాలంగా సైనస్ సమస్యతో బాధపడుతున్న ప్రసాద్ ఆరోగ్యం ఈరోజు క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ప్రసాద్ కు అక్కడి వైద్యులు ఐసీయూలో చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయమై ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ.. సైనస్ సమస్యలతో ప్రసాద్ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు.
ravi shankar prasad
aims
sick
New Delhi
hospital
cynas

More Telugu News