13 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించడానికి 3,500 కిలోమీటర్లు ఎగిరివచ్చారా?: ప్రధాని మోదీకి ట్రోలింగ్
- కొల్లామ్ బైపాస్ రోడ్డును ప్రారంభించిన ప్రధాని
- సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
- మోదీపై విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ
గతంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కనీసం ఓ సీటీ స్కాన్ మెషీన్ ను అయినా ప్రారంభించారనీ, కానీ మోదీ మాత్రం అది కూడా చేయకుండా పోయారని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అనీల్ ఫిలిప్ అనే జర్నలిస్ట్ స్పందిస్తూ.. ఈ కొల్లామ్ బైపాస్ రోడ్డును నిర్మించాలని 47 క్రితం ప్రతిపాదన వచ్చిందనీ, భూమిని 40 ఏళ్ల క్రితం సేకరించారని తెలిపారు.
ఈ రోడ్డు పనులు 28 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రతీఒక్కరూ రోడ్డును తామే నిర్మించామని క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఈ రోడ్డు వెడల్పు సాధారణ చీరంత కూడా ఉండదని ఎద్దేవా చేశారు. మరోవైపు సీపీఎం మద్దతుదారులు, కార్యకర్తలు అసహనంతోనే మోదీని ట్రోల్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది.