YSRCP: జగన్‌ సీఎం కావాలంటూ తెలంగాణ వైసీపీ నేతల తిరుమల యాత్ర

  • భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో బృందం
  • మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్న నాయకులు
  • శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆ పార్టీ తెలంగాణ నేతలు తిరుమల యాత్ర చేపట్టారు. భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు అప్పం కిషన్‌తోపాటు వెంకటరెడ్డి, నరేష్‌, కుమార్‌, సంపత్ తదితరులతో కూడిన బృందం మంగళవారం తిరుమల చేరుకుంది.

 అలిపిరి మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కాలినడకన కొండపైకి చేరుకున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బృందం నాయకుడు కిషన్‌ మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసినందున స్వామి వారిని దర్శించుకున్నట్లు వివరించారు. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
YSRCP
Jayashankar Bhupalpally District
Tirumala

More Telugu News