Bollywood: రిచా గంగోపాధ్యాయకు నిశ్చితార్థం.. ఫొటోను విడుదల చేసిన నటి!

  • జోయ్ అనే యువకుడితో రిచా పెళ్లి
  • రెండేళ్ల క్రితం బీస్కూల్ లో పరిచయం
  • ట్విట్టర్ లో సంతోషాన్ని పంచుకున్న రిచా
ప్రముఖ నటి రిచా గంగోపాధ్యాయ నిశ్చితార్థం జరిగిపోయింది. రెండేళ్లుగా ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగిందని రిచా గంగోపాధ్యాయ తెలిపింది. తాను చదువుకున్న బిజినెస్ స్కూలులో రెండేళ్ల క్రితం జోయ్ తో తనకు పరిచయం ఏర్పడిందని రిచా పేర్కొంది. పెళ్లి తేదీ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. లీడర్, మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు, మిర్చి, భాయ్ తదితర తెలుగు సినిమాల్లో రిచా నటించింది.
Bollywood
Tollywood
richa
engagement
Twitter
pic
announcement

More Telugu News