YS Jagan: ఈ విష సంస్కృతిని నియంత్రించాలి: షర్మిలకు అండగా విజయశాంతి

  • సోషల్ మీడియాలో షర్మిలపై అసత్య ప్రచారం
  • ఆవేదన వ్యక్తం చేసిన విజయశాంతి
  • నిందితులపై చర్యలు తీసుకోవాలి
వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. సెలబ్రిటీలపై విషం కక్కే ఇటువంటి విష సంస్కృతిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పురుషాధిక్యత ఎక్కువైన రాజకీయాల్లో మహిళలను అణగదొక్కాలని చూసే ఇటువంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో షర్మిలపై జరుగుతున్న ప్రచారం చూస్తుంటేనే అర్థం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయన్నారు. మరే మహిళకు ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
YS Jagan
YS Sharmila
Vijayashanthi
Congress
Social Media

More Telugu News