ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. భారత ఫుట్ బాల్ జట్టు కోచ్ రాజీనామా
- బెహ్రైన్తో జరిగిన మ్యాచ్లో ఓటమి
- ఆసియా కప్-2019 నుంచి భారత్ నిష్క్రమణ
- రాజీనామా చేసిన కోచ్ స్టీఫెన్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్లుగా నేను భారత్ ఫుట్ బాల్ జట్టుకు కోచింగ్ ఇస్తున్నాను. ఈ నాలుగేళ్లలో మేం చాలా సాధించాము.. ఎన్నో రికార్డులు సాధించాము. ప్రతీ ఆటగాడికి నేను రుణపడి ఉంటాను. నా కాలం ముగిసింది. నేను ఇచ్చిన మాట కోసం చాలా కష్టపడ్డాను.. ఫలితం కూడా అలానే వచ్చింది’’ అని స్టీఫెన్ తెలిపారు.