Imran Hasmi: ఐదేళ్ల క్యాన్సర్‌ పోరాటంలో విజయం సాధించిన బాలీవుడ్ హీరో కుమారుడు!

  • 2014 నుంచి క్యాన్సర్‌
  • ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు
  • మీరూ ఈ పోరాటంలో విజయం సాధిస్తారు
బాలీవుడ్ ప్రముఖ హీరో ఇమ్రాన్ హష్మీ కుమారుడు అయాన్ 2014 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ సమయంలో అయాన్ వయసు నాలుగేళ్లు మాత్రమే. విషయం తెలియగానే ఇమ్రాన్ కన్నీటి పర్యంతమయ్యాడట. కానీ తన భార్య మాత్రం చాలా ధైర్యంగా ఉందని ఇమ్రాన్ అప్పట్లో పేర్కొన్నాడు. తాజాగా వైద్యులు ఇమ్రాన్‌కు శుభవార్త అందించారు. తన కుమారుడికి క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందని తేల్చారు.

ఈ విషయాన్ని పేర్కొంటూ ఆనందంతో ఇమ్రాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే కాకుండా తన కుమారుడితో ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. ‘ఐదేళ్ల తర్వాత ఇవాళ అయాన్‌ క్యాన్సర్‌ను జయించాడని వైద్యులు వెల్లడించారు. అయాన్‌ కోసం ప్రార్థనలు చేసి, విష్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మంది కోసం నేను ఎప్పుడూ దేవుడ్ని ప్రార్థిస్తూనే ఉంటాను. మీరు క్యాన్సర్‌తో జరుపుతున్న ఈ పోరాటంలో విజయం సాధిస్తారు’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.
Imran Hasmi
Bollywood
Ayan
Cancer
Social media

More Telugu News