bjp: రథయాత్రల విషయంలో బీజేపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

  • పశ్చిమబెంగాల్ లో రథయాత్రలకు అనుమతి నిరాకరణ
  • కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం
  • బహిరంగసభలు నిర్వహించుకోవడానికి అనుమతి
పశ్చిమబెంగాల్ లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. రథయాత్రలను నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించింది. బహిరంగసభలను మాత్రమే నిర్వహించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలను నిర్వహించాలనుకున్న బీజేపీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డు తగిలారు. శాంతభద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణాలతో యాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది.

దీంతో కలకత్తా హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ యాత్రలకు అనుమతి ఇచ్చింది. దీంతో, హైకోర్టు డివిజన్ బెంచ్ కు మమత ప్రభుత్వం అప్పీల్ చేసింది. యాత్రలకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించడంతో... సుప్రీంకోర్టును బీజేపీ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది. 
bjp
rathayatra
West Bengal
Supreme Court

More Telugu News