Andhra Pradesh: అప్పట్లో చిరంజీవి కుటుంబ సభ్యులపై చంద్రబాబు దుష్ప్రచారం చేయించారు!: పోసాని సంచలన ఆరోపణ

  • మెగా కుటుంబంపై పుకార్లు పుట్టించారు
  • చంద్రబాబుకు ఇలాంటివి బాగా అలవాటు
  • ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేదు
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. రాజకీయ ప్రత్యర్థుల ఇంట్లోవారిపై ఆరోపణలు చేయించడం ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా అలవాటని విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై ఇదే రీతిలో పుకార్లు పుట్టించారని ఆరోపించారు. కడప జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన పోసాని.. ఇర్కాన్‌ సర్కిల్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  తనకు అసలు ఎన్నికల్లో పోటీ చేేసే ఉద్దేశమే లేదని పోసాని స్పష్టం చేశారు. జీవితాంతం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. తనకు ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే ఆలోచనే లేదని పునరుద్ఘాటించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Sharmila
Posani Krishna Murali
angry
Kadapa District

More Telugu News