Andhra Pradesh: కడప జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరనున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో అధికార టీడీపీకి షాక్ తగలనుంది. టీడీపీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాజంపేట వైసీపీ నేతలతో ఈ విషయమై మాట్లాడిన మల్లికార్జున రెడ్డి, విజయసాయిరెడ్డితో ఓసారి చర్చించాక వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతోనే మేడా మల్లికార్జునరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన సరిగ్గా ఎన్నికలకు ముందుగా వైసీపీలో చేరబోతున్నారు. కాగా, మల్లికార్జున రెడ్డికి వైసీపీలో ఏ బాధ్యత అప్పగిస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
Go Back to Shorts
Andhra Pradesh
Kadapa District
YSRCP
Telugudesam
rajampeta
meda
mallikarjuna reddy

More Telugu News