Andhra Pradesh: సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి నాగాలమ్మకు పూజలు!

  • చిత్తూరులోని స్వగ్రామం నారావారిపల్లెలో సీఎం
  • తల్లిదండ్రులకు నివాళులు అర్పించిన చంద్రబాబు
  • పూజల్లో పాల్గొన్న లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి నాగాలమ్మ ఆలయం వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట కుమారుడు లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి, భార్య భువనేశ్వరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు.
Andhra Pradesh
Chandrababu
Chittoor District
naravaaripally
sankranti

More Telugu News