Telangana: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పోలీసుల భయంతో రాయితో తలపై మోది హత్య!

  • తెలంగాణలోని సంగారెడ్డిలో ఘటన
  • మహిళను దారుణంగా హత్యచేసిన వ్యక్తులు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
భర్త నుంచి విడిపోయి మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళపై కొందరు వ్యక్తులు దారుణానికి తెగబడ్డారు. అత్యాచారం చేయడంతో పాటు, విషయాన్ని ఆమె పోలీసులకు చెబుతుందేమోనన్న భయంతో కిరాతకంగా హత్యచేశారు.  తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని ఝరసంగం ప్రాంతానికి చెందిన పుణ్యమ భర్త నుంచి 30 ఏళ్ల క్రితం విడిపోయింది. మతిస్థిమితం కోల్పోయి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పుణ్యమపై కన్నేసిన కొందరు మృగాళ్లు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం విషయం పోలీసులకు పొక్కకుండా బలమైన వస్తువుతో తలపై మోది చంపారు.

ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. స్థానికులు అచేతనంగా రక్తపు మడుగులో పడిఉన్న పుణ్యమను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తలపై బలంగా కొట్టడంతోనే బాధితురాలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
Telangana
attack
rape
killed
Police
Sangareddy District

More Telugu News