anchor: ఇలాంటి వ్యాఖ్యలతో బాధించకండి: నెటిజన్ కు టీవీ యాంకర్ రష్మి హితవు

  • ‘హ్యాపీ మకర సంక్రాంతి’ అన్న రష్మి పోస్ట్ పై విమర్శ
  • ఈరోజు భోగి అన్ననెటిజన్  
  • నెటిజన్ కు చురక అంటించిన రష్మి 
‘హ్యాపీ మకర సంక్రాంతి’ అంటూ భోగి మంటల వీడియోను ప్రముఖ యాంకర్ రష్మి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే, 'మకర సంక్రాంతి కాదు మేడమ్, అది భోగి, దయచేసి తెలుగు నేర్చుకోండి' అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కలత చెందిన రష్మి వెంటనే స్పందించింది.

తమ కుటుంబంలో కేవలం మకర సంక్రాంతిని మాత్రమే జరుపుకుంటామని, అందుకే, ఆ విధంగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశానని చెప్పింది. 'మీ సంప్రదాయాలను నేను ఎలా అయితే గౌరవించానో, అలానే మీరూ, నన్నూ గౌరవించాలి తప్ప, ఎలాంటి కారణం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలతో  బాధించకూడదు' అంటూ ఆ నెటిజన్ కు ఆమె చురకలంటించడం గమనార్హం.

కాగా, ఈ ఏడాది మకర సంక్రాంతి ఎప్పుడన్న విషయాన్ని ‘గూగుల్’లో రష్మి వెతికింది. ‘జనవరి 14, సోమవారం’ అని వచ్చిన సెర్చ్ రిజల్ట్ ని స్క్రీన్ షాట్ తీసి, దాన్ని తన పోస్ట్ ద్వారా రష్మి ట్వీట్ చేసింది. 
anchor
rashmi
makara sankranthi
google

More Telugu News