Andhra Pradesh: ఆంధ్రా పోలీస్ ని ఏపీ ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకుంది: వాసిరెడ్డి పద్మ ఆరోపణలు

  • వైఎస్ కుటుంబంపై ఏపీ సీఎం కక్షగట్టారు
  • పోలీస్ వ్యవస్థను వారి చేతిలో పెట్టుకున్నారు
  • అందుకే, తెలంగాణ పోలీస్ కు ఫిర్యాదు చేశాం
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాలని కోరుతూ వైఎస్ షర్మిళ ఈరోజు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె వెంట వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడా ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రా పోలీస్ పై తమకు నమ్మకం లేదని, వైఎస్ కుటుంబంపై ఏపీ ముఖ్యమంత్రి, అక్కడి ప్రభుత్వం, టీడీపీ నాయకులు కక్షగట్టి ఉన్నారని, పోలీస్ వ్యవస్థను వారి చేతిలో పెట్టుకున్నారని ఆరోపించారు. ఆంధ్రా పోలీస్ కు సంబంధించిన క్రెడిబులిటిపై తాము మాట్లాడటం లేదని, అక్కడి పోలీసులను ఏపీ ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకుంది కనుక, ఈ దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని భావించామని, అందుకే, తెలంగాణ పోలీస్ కు ఫిర్యాదు చేశామని వివరించారు. తాము చేసిన ఫిర్యాదుకు పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
Andhra Pradesh
ap police
YSRCP
vasireddy

More Telugu News