Nara Lokesh: తిరుమల శ్రీవారి సన్నిధిలో మంత్రి నారా లోకేష్‌ దంపతులు

  • వేద పండితుల ఆశీర్వాదం
  • స్వామి శేషవస్త్రంతో సత్కారం
  • ఆలయంలో దేవాన్ష్‌ సందడి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ నేటి ఉదయం తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు రంగనాయకుల మండపంలో లోకేష్‌ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. అధికారులు స్వామి వారి శేషవస్త్రాన్ని అందించి సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా లోకేష్‌ తనయుడు దేవాన్ష్‌ ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సంప్రదాయ వస్త్రధారణతో తల్లిదండ్రుల ముందు నడుస్తూ వెళ్లిన దేవాన్ష్‌ భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు.
Nara Lokesh
Tirumala

More Telugu News