Jagan: సోషల్ మీడియాలో ఇంత అసభ్య వ్యాఖ్యలా?: భర్తతో కలిసి హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిళ

  • జగన్ ను అణగదొక్కాలని తప్పుడు ప్రచారం
  • అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు
  • సీపీకి ఫిర్యాదు చేసిన షర్మిళ
రాజకీయంగా తనను, తన అన్న వైఎస్ జగన్ ను, ఆయన కుటుంబాన్ని అణగ దొక్కాలని చూస్తున్న కొన్ని రాజకీయ శక్తులు సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ షర్మిళ ఆరోపంచారు. ఈ ఉదయం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ను కలిసిన ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు.

తనపై, తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనకు అందించానని, ఆయన సానుకూలంగా స్పందించి, విచారణ జరిపిస్తానని మాటిచ్చారని అన్నారు. షర్మిళతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, వైకాపా నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు.
Jagan
Sharmila
Social Media
Hyderabad
CP
Anjani Kumar

More Telugu News