C/o Kancharapalem: కేటీఆర్ చొరవతో 'కేరాఫ్ కంచరపాలెం' టీమ్ కు ఊరట!

షార్ట్స్‌లో చూడండి
'కేరాఫ్ కంచరపాలెం'... తక్కువ బడ్జెట్ తో తయారై, సినీ ప్రేక్షకులను మెప్పించిన చిత్రం. గత సంవత్సరం విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా ఉన్న 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రాన్ని ఓ ఎన్నారై నిర్మించారన్న కారణంతో, జాతీయ అవార్డుల బరిలో నిలిచేందుకు అర్హత లేదంటూ అవార్డుల నిర్వాహక కమిటీ ప్రకటించింది.

 ఇక విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్, కేంద్రమంత్రి రాజ్ వర్ధన్ సింగ్ రాథోడ్ తో స్వయంగా మాట్లాడగా, ఈ సినిమాను కూడా పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు అంగీకరించారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఎండీ పరుచూరి, తమకు సహకరించిన కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిబంధనను శాశ్వతంగా తొలగించేలా చూడాలని ఆయన కోరారు.
Go Back to Shorts
C/o Kancharapalem
National Awards
KTR

More Telugu News