‘జగన్ పై దాడి కేసు’లో నేడు ఎన్ఐఏ విచారణ.. లాయర్ సలీంకు సమాచారం అందించిన అధికారులు!
- విశాఖ సీఆర్పీఎఫ్ క్యాంప్ లో శ్రీనివాసరావు
- నేడు విచారించనున్న ఎన్ఐఏ అధికారులు
- అక్టోబర్ 25న జగన్ పై కోడికత్తితో దాడి
విశాఖపట్నం విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ కు చేరుకుని శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం ఏపీ పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఈ దాడి ఘటనపై విచారణ జరిపించాలని జగన్ అప్పటి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.