Andhra Pradesh: తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!

  • పేదల కళ్లలో వెలుగే నిజమైన సంక్రాంతి అని వ్యాఖ్య
  • పింఛన్ల పెంపు పెద్ద కానుకని వెల్లడి
  • జన్మభూమిని అడ్డుకోలేకపోయారన్న సీఎం
పేదల కళ్లలో వెలుగే నిజమైన సంక్రాంతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పింఛన్ పెంపు పేదలకు పెద్ద కానుక అని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. పారదర్శకంగా, నిస్వార్థంగా పనిచేయడం వల్లే జన్మభూమి కార్యక్రమంలో గొడవ చేయాలని కొందరు యత్నించినా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
Telugudesam
sankranti
bhogi
wishes

More Telugu News