Jagan: గండి వీరాంజనేయస్వామి సన్నిధికి వైఎస్ జగన్!
ఇటీవల తన సుదీర్ఘ పాదయాత్రను ముగించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా చక్రయ్యపేట మండలం, వీరన్నగట్టుపల్లిలో కొలువైన గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని సందర్శించారు. పాదయాత్రకు ముందు కూడా ఆయన ఈ ఆలయానికి వచ్చారు. స్వామి సన్నిధికి వచ్చిన జగన్ కు, ఆలయ పూజారులు స్వాగతం పలికారు.
జగన్ వస్తున్నారని తెలిసి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వైకాపా కార్యకర్తలు, అభిమానులు వెల్లువలా రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. ఆంజనేయస్వామిని దర్శించుకున్న జగన్ ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.