Bihar: బూతులు తిడుతూ స్థానికుడి చెంపలు వాయించిన ఆర్జేడీ ఎమ్మెల్యే

  • భూ వివాదంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం
  • ఆగ్రహంతో చెంప పగలగొట్టిన వైనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
బీహార్‌ ఆర్జేడీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ యాదవ్‌పై కేసు నమోదైంది. ఓ భూ వివాదం విషయంలో స్థానికుడిని బూతులు తిడుతూ చెంపలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో రెండు రోజులుగా వైరల్ అవుతోంది. తాజాగా, భాదితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు, బాధితుడి వివరాల ప్రకారం.. లఖీసరాయ్ జిల్లాలోని సత్యగ్రహలో ఓ భవనం నిర్మాణంలో ఉంది. భవనం వద్దకు తన అనుచరులు, పోలీసులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే ప్రహ్లాద్ యాదవ్ భూమి విషయమై స్థానికుడితో వాగ్వివాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే అతడిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపలు పగలగొట్టారు. అనంతరం అతడిని హెచ్చరించి అనుచరులతో కలిసి వెళ్లిపోయారు.

Bihar
Prahlad Yadav
RJD MLA
Slaps
police

More Telugu News